కువైత్ తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దేశంలోని లేబర్ మార్కెట్లో ప్రవాసుల వర్క్‌ఫోర్స్ కోటాను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కోటాను తీసువచ్చినట్లైతే అన్ని రంగాల్లో వలస కార్మికుల సంఖ్యపై పరిమితి ఉంటుంది. మునుపటిలా భారీ సంఖ్యలో వలసదారులకు ఉపాధి అవకాశాలు ఉండవు. అలాగే ఆ దేశంలో భారీగా ఉపాధి పొందుతున్న కొన్ని జాతీయులకు గరిష్ట పరిమితి విధించడం జరుగుతుంది.
ఇక ఇప్పటికే కువైటైజేషన్ పాలసీ పేరుతో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచి, ప్రవాసుల ప్రాబల్యం తగ్గించడమే లక్ష్యంగా గడిచిన ఐదేళ్ల నుంచి ఈ పాలసీని అమలు చేస్తోంది. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ప్రవాస కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రవాస కార్మికుల సంఖ్యను నియంత్రించడానికే గల్ఫ్ దేశం ఇలా కోటా విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా కొన్ని రంగాలలో ధరల పెరుగుదల కూడా కార్మికుల నియంత్రణకు దారితీసిన్నట్లు లేబర్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.