గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాది 6 నెలల్లో 8 వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్లను ఉపసంహరించింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కావాల్సిన షరతులను వారు అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ప్రవాసులకు డ్రైవింగ్ లెసెన్స్ పొందేందుకు ప్రధానంగా శాలరీ, ప్రొఫెషన్, యూనివర్శిటీ డిగ్రీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్ పొందినప్పుడు ఉన్న జాబ్ ప్రొఫెషన్ ఆ తర్వాత కొత్త ఉద్యోగంలో మారితే అలాంటి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రవాస విద్యార్థుల ఎవరైతే స్టడీస్ పూర్తి చేసుకుంటారో వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉపసంహరించడం జరుగుతుంది. అలాగే కువైటీ పౌరులకు చెందిన మరో 50 డ్రైవింగ్ లైసెన్లు బ్లాక్ చేసింది. కువైత్ పౌరుల దృష్టి, మానసిక వైకల్యాల కారణంగా ఇలా వారి లైసెన్స్‌ను బ్లాక్ చేయడం జరిగింది.