Namaste NRI

 ప్రవాసులకు కువైత్ షాక్   

గల్ఫ్ దేశం కువైత్  ఉద్యోగావకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 2017లో  కువైటైజేషన్ పాలసీని  తీసుకొచ్చింది. ప్రవాసుల ప్రాబల్యం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో కువైటీలకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని భావించిన కువైత్ సర్కార్ ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి అటు ప్రభుత్వ రంగంతో పాటు ఇటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో దశలవారీగా ప్రవాస ఉద్యోగులపై వేటు వేయడం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ 100శాతం కువైటైజేషన్‌ను సాధించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కువైటైజేషన్ అమలులోకి వచ్చిన 2017 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,048 మంది ప్రవాస ఉద్యోగులను  తొలగించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 629 మంది కువైటీలను కొత్తగా ఉద్యోగాల్లో తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శాఖలో 100 శాతం ఉద్యోగులు కువైత్ పౌరులేనని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News