కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో కువైత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్‌పై పోరులో భాగంగా పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. ఒమైక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే పౌరులకు విజిట్ వీసాలను జారీ చేసే విషయమై కఠిన నిబంధనలు అమలు చేయనునన్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడిరచారు. గత వారం రోజుల్లో 1,200 టూరిస్ట్ వీసాలు మంజూరు చేయగా, వీటిలో అత్యధికంగా 53 దేశాల పౌరులకు ఈ`వీసాల రూపంలో ఆన్‌లైన్ ద్వారా జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఈ 53 దేశాల వారికి టూరిస్ట్ వీసాలు అంతా ఈజీగా ఇవ్వబోమని అధికారులు పేర్కొన్నారు. కాగా మంత్రిత్వశాఖ దేశాల జాబితాను మాత్రం వెల్లడిరచలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)