డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌లకు చెల్లుబాటయ్యే ధృవీకరణ పత్రంగా మొబైల్ ఐడీ ని కువైత్ ప్రభుత్వం ఆమోదించింది. ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ అల్ సభా మంత్రివర్గం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కువైత్ మొబైల్ ఐడీ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌లను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో చెల్లుబాటు అయ్యే అధికారిక పత్రంగా ఆమోదించింది. కువైత్ మొబైల్ ఐడీ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, వాహనాన్ని నడపడానికి అనుమతిని దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆమోదించాలని సర్క్యూలర్ జారీ అయింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో మొబైల్ ఐడీని తప్పనిసరిగా అంగీకరించాల్సిందేనని మంత్రివర్గం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
