జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందన తెలియజేసింది. లఢఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము గుర్తించడంలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు. లఢఖ్‌ను భారత్ ఏకపక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిందని ఆరోపించిన మావో నింగ్, దాన్ని తాము గుర్తించడంలేదని అన్నారు. ఆర్టికల్ 370పై భారత సుప్రీంకోర్టు తీర్పు చైనా-భారత్ సరిహద్దుకు సంబంధించిన వాస్తవ స్థితిని మార్చలేదని అన్నారు. లఢఖ్ ఎప్పటికీ తమ భూభాగమేనని నింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.