శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అద్భుతమైన స్పందన దక్కించుకోగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా తన ఫ్యామిలీతో ఎంత ఆప్వాయంగా ఉంటారో చూపించారు. ఫ్మామిలీతో కలిసి చూడదగ్గ కుటుంబ కథా చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళల గొప్పతనాన్ని చాటే విధంగా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. సీనియర్ నటీమణులు కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ నటించారు. తిరుమల కిషోర్ తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)