
అన్ని రంగాల్లోకి పాకిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు రాజకీయ రంగంలోకీ ప్రవేశించింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రి డియెల్లా ను నియమించింది.ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఎడిరామ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత మంత్రిని నియమించినట్టు తెలిపారు. ఇకపై ఈ ఏఐ మంత్రి ప్రభుత్వ టెండర్ల పర్యవేక్షణ బాధ్యతను చూసుకుంటుంది.
















