విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కథానుగుణంగా ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయన లేడీ క్యారెక్టర్‌లో కనిపించ నున్నారు. లైలా పాత్రలో ఇప్పటికే విడుదలైన విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌సేన్ ైస్టెలిష్ లుక్స్‌తో కనిపించారు. మోడరన్ అవుట్‌ఫిట్‌లో ట్రెండీగా ఉన్నారు. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ పాత్ర డిఫరెంట్ షేడ్స్‌లో సాగుతుందని, ఆయన కెరీర్‌లోనే వైవిధ్యమైన కథాంశమని మేకర్స్ తెలిపారు. ఆకాంక్షశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, దర్శకత్వం: రామ్ నారాయణ్.