Namaste NRI

తానా ఎన్నికలలో లావు అంజయ్య చౌదరి సంపూర్ణ మద్దతు టీం కొడాలికే

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారికి తన సేవా కార్యక్రమాలతో  పరిచయం అక్కరలేని వ్యక్తి, తాజా మాజీ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికలలో తన సంపూర్ణ మద్దతు నరేన్ కొడాలి ప్యానెల్ కి తెలిపారు,అంతే కాకుండా గత నాలుగు వారాలుగా అమెరికా లో పలు ముఖ్య పట్టణాలలో సుడిగాలి పర్యటన చేసి నరేన్ కొడాలి ప్యానెల్ కి ప్రచారం చేసారు. తానా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన కొన్ని వందల కార్యక్రమాలలో అంజయ్య చౌదరి గారితో  భాగస్వామ్యులు ఐన చాల మంది సభ్యులు ఇప్పుడు నరేన్ కొడాలి ప్యానెల్ లో పోటీ చేస్తున్నారు.

వ్యక్తుల ప్రయోజనాలు కన్నా సంస్థ ప్రయోజనాలు ముఖ్యం అని భావించే అంజయ్య చౌదరి లావు గారు దానికనుగుణంగా పనిచేసే వారికి మద్దతు తెలపవలసిన  అవసరం ఎంతైనా వుంది అని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాకరమైన తానా సంస్థ మరింత ముందుకు తీసుకు వెళ్లి అమెరికా, కెనడా మరియు ఇండియా లో తెలుగు వారికి మరింత సేవలు అందించటానికి నరేన్ కొడాలి ప్యానెల్ ని అత్యంత మెజారిటీ తో గెలిపించవలసింది గా అభ్యర్థిస్తూ పిలుపునిచ్చారు .

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events