Namaste NRI

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హ్యాపీ బర్త్‌ డే. సత్య, నరేష్‌, అగస్త్య, వెన్నెల కిషోర్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హ్యాపీ 340 అనే పాత్రలో లావణ్యా త్రిపాఠి కనిపిస్తారని చిత్రయూనిట్‌ వెల్లడిరచింది. కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. లావణ్య పాత్ర ఎవరూ ఊహించని విదంగా ట్విస్టులతో వినోదాత్మకంగా ఉంటుంది అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో  కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని,  వై.రవిశంకర్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన చిత్రం ఇది. జూలై 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : కాల బైరవ, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events