శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయే నంటూ నిరసనకారులు ఆయన అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మాల్దీవులో కూడా శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సను నిరసన సెగ తగలడంతో పలాయనం చిత్తగించక తప్పలేదు. దీంతో ఆయన గత నెల జులై 14 నుంచి సింగపూర్‌లో 14 రోజుల పర్యాటక వీసాపై అక్కడే ఉంటున్నారు. ఐతే ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రాజపక్సను మరో 14 రోజులు అక్కడే ఉండనివ్వండి అంటూ సింగపూర్ అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో ఆయన మరికొన్ని రోజులు సింగపూర్‌లోనే గడపనున్నట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)