అమెరికా సైనికాధికారి ఫ్లిన్ చైనా సైనిక దురాక్రమణకు పాల్పడుతోందనే విమర్శలను చైనా అధికారికంగా ఖండిరచింది. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం అగ్గి రగల్చడానికే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ వ్యాఖ్యానించారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఏరాట్లు, సైనిక కదలికలు అంతా కూడా కలవరానికి దారితీస్తున్నాయని, దీనిపై అన్ని పక్షాలు స్పందించాల్సి ఉందని అమెరికా పసిఫిక్ ప్రాంతసైనిక దళాల అధికారి పరోక్షంగా భారత్‌కు బాసటగా మాట్లాడారు. భారత్ చైనాలు ఉభయపక్షంగా చిత్తశుద్ధితో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుని ఉన్నాయని, ఇప్పుడు ఈ దశలో అమెరికా హితబోధ ఎందుకు అని చైనా ప్రతినిధి ప్రశ్నించారు. ఇది ఇరు దేశాల కీలక అంశం. దీనిపై ఇతరులు ఎందుకు స్పందించడం? అని నిలదీశారు. ఈ ప్రాంతంలో నిలకడ పరిస్థితిని కావాలనే దెబ్బతీయాలని అమెరికా వంటి కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో దాదాపు రెండేళ్ల ప్రతిష్టంభన క్రమేపీ సద్దుమణిగి ఇప్పుడు నెమ్మది పరిస్థితి ఏర్పడిరదని, దీనిని కాదనేలా అమెరికా వ్యాఖ్యానించడం ఎందుకు? అని వారు ప్రశ్నించారు.














