Namaste NRI

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో లైఫ్ మెంబర్స్ ఫామిలీ డే – 2025

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే ను ఇక్కడి ఈస్ట్ కోస్ట్ పార్క్ (ECP), సింగపూర్ లో మే  31న ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డే లో సుమారు 200 వరకు టీసీఎస్ఎస్ (TCSS) కు చెందిన లైఫ్ మెంబెర్స్ ఎంతో ఉత్సాహంగా  పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని మరియు ఆటలను  భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలయినటువంటి సంచి దుంకుడు, కచ్చకాయలు, మరియు ఇతర వినోద భరిత ఆటలు అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్ , తంబోలా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ మాట్లాడుతూ ఎలాంటి హంగు ఆర్భాటాలు మరియు లాభాపేక్ష లేకుండా చేస్తున్న కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శప్రాయం మరియు అభినందనీయం అన్నారు.

టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ ఫామిలీ డే – 2025 విజయవంతంగా జరుగుటకు సహకరించి ఈ  కార్యక్రమం లో పాల్గొన్న ప్రతీ  ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి  మరియు స్పాన్సర్స్ కు  పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి రమేష్ గడప, రాము బొందుగుల మరియు వెంకటరమణ నంగునూరి, కల్వ లక్ష్మణ్ రాజు మొదలగు వారు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News