జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు షరతులతో కూడిన లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఓలాఫ్ స్కోల్జ్ ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమా హాళ్లతో పాటు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే టీకా తీసుకొని వారు బయట తిరగడాన్ని నిషేధించారు. టీకా తీసుకున్న వారికి మాత్రం మినహాయింపును ఇచ్చారు.
కొవిడ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన చర్యలను జర్మన్ ఉన్నత న్యాయస్థానం సమర్పించిన నేపథంలో ఆదేశాలు జారీ చేసింది. జర్మనీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 24 గంటల్లో 67 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి.