నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. ఈ చిత్రం 24న థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా కలిసి ఏషియన్ ఆఫీస్‌లో సక్సెస్ మీటను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్యాండమిక్ సమయంలో చిత్ర యూనిట్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ చిత్రంలోని పాయింట్ నాకు కత్తి మీద సాము లాంటిది. ఆడపిల్లల చాలా మంది ఇబ్బందిపడే అంశాన్ని కులవివక్ష కలిసి కత్తి మీద సాము లాంటి పాయింట్‌ని తీశాను. ఇలాంటి క్యారెక్టర్స్‌ని చేయడానికి ఒప్పుకున్నందుకు నాగచైనత్యకు, సాయిపల్లవికి చాలా థ్యాంక్స్. పవన్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఇంకా ఇందులో నటించిన దేవయాని, ఉత్తేజ్, రాజీవ్ అందరికీ థ్యాంక్స్ అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇంక దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడేదేమీ ఉండదు. నెక్స్ట్ మూవీ కూడా సేమ్ కాంబినేషన్‌తో మళ్లీ రిపీట్ అవుతుంది. ప్యాండమిక్ టైమ్ తర్వాత 650 థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు.