Namaste NRI

దీపావళి కానుకగా లక్కీభాస్కర్‌

దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న చిత్రం లక్కీభాస్కర్‌. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం.  సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 7న విడుదల చేయాలని నిర్మాతలు మొదట్లో భావించారు. అయితే,  ఇప్పుడు అక్టోబర్‌ 31న దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి అదనపు సమయం పడుతుందని, అందుకే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే విడుదలను మరో నెలరోజులు వాయిదా వేశామని, కళా దర్శకు డు బంగ్లాన్‌ నిర్మించిన 80ల నాటి ముంబై సెట్‌, నిమిష్‌ రవి కెమెరా పనితనం, నవీన్‌నూలీ ఎడిటింగ్‌ ఈ సిని మాకు హైలైట్స్‌గా నిలువనున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News