Namaste NRI

సర్కారు నౌకరి నుంచి లిరికల్‌ సాంగ్‌

గాయని సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు నౌకరి. భావన కథానాయిక. ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. స్వీయ రచనతో సినిమాటోగ్రఫీని కూడా తానే అందిస్తూ గంగనమోని శేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నీ పసుపు పాదాలే అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ గీతాన్ని శాండిల్య పీసపాటి స్వరపరిచి, కీర్తనతో కలిసి ఆలపించారు. నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా, నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనా కంచు మెట్టె సప్పళ్లో ఇల్లే కళ్లు తెరిసి సూసెనా అంటూ నవవధువు అత్తింట్లోకి అడుగుపెడుతున్న సందర్భంలో సాగే ఈ పాట కథలో భాగంగా ఉంటుందని, చిత్రీకరణ కూడా అద్భుతంగా కుదిరిందని దర్శకుడు తెలిపారు. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్యసాయి శ్రీనివాస్‌ తదితరులు ఇందులో ఇతర పాత్రధారులు. జనవరి 1న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events