రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా నటిస్తున్న లవ్ అండ్ కామెడీ ఎంటైర్టెనర్ ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్. అశోక్‌రెడ్డి కడదూరి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, సురేశ్ బొబ్బిలి స్వరపరిచారు.

కార్తీక్ హరిణి ఆలపించారు. నాయకానాయికల ప్రేమబంధాన్ని ఆవిష్కరించేలా ఈ పాట రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. అజయ్‌ఘోష్, మురళీధర్‌గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, గంగవ్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ కొప్పెర.
