Skip to main content

Namaste NRI

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

రాహుల్‌ విజయ్‌, నేహా పాండే జంటగా నటిస్తున్న లవ్‌ అండ్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌. అశోక్‌రెడ్డి కడదూరి దర్శకుడు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే,  నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా  అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, సురేశ్‌ బొబ్బిలి స్వరపరిచారు.

కార్తీక్‌ హరిణి ఆలపించారు. నాయకానాయికల ప్రేమబంధాన్ని ఆవిష్కరించేలా ఈ పాట రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. అజయ్‌ఘోష్‌, మురళీధర్‌గౌడ్‌, గెటప్‌ శ్రీను, రచ్చ రవి, గంగవ్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ కొప్పెర.

Social Share Spread Message

Latest News