Namaste NRI

నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి

నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) అధ్యక్షుడిగా మదన్‌ పాములపాటి ఎంపికయ్యారు. 2024-26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్‌ బోర్డు పేర్కొంది. నాట్స్‌ షికాగో విభాగంలో చురుగ్గా వ్యవహరించే మదన్‌ పాములపాటి.. గతంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. రెండుసార్లు నాట్స్‌ కోశాధికారి, సంబరాల కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడి(సేవలు)గా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో నాట్స్‌ అధ్యక్ష పదవికి బోర్డు ఆయనవైపు మొగ్గు చూపింది.

శ్రీహరి మందాడి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), శ్రీనివాసరావు భీమినేని (ఆపరేషన్స్), హేమంత్ కొల్ల (ఫైనాన్స్), భాను ప్రకాశ్ ధూళిపాళ్ల  (మార్కెటింగ్), శ్రీనివాస్ చిలుకూరి (ప్రోగ్రామ్స్), నాట్స్ కార్యదర్శి గా రాజేష్ కాండ్రు, కార్యనిర్వహక కార్యదర్శి (మీడియా)గా మురళీ కృష్ణ మేడిచెర్ల, రవి తుమ్మల (వెబ్) , ట్రెజరర్‌గా సుధీర్‌ మిక్కిలినేని, సంయుక్త ట్రెజరర్‌గా రవి తాండ్ర నియమితులయ్యారు. కార్యవర్గంలో శ్రీనివాస్‌ మెంటా, వెంకట రావు దగ్గుబాటి, సుమంత్‌ రామినేని, సత్య శ్రీరామనేని, శ్రీహరీష్‌ జమ్ముల, మనోహర్‌రావు మద్దినేని, భాను లంకా, ఎమ్మాన్యుయెల్‌, కిశోర్‌ నారె, సంకీర్థ కటకం, కిరణ్‌ మందాడి, ఆర్‌కే బాలినేని, రాజలక్ష్మి చిలుకూరి, కిశోర్‌ గరికపాటి, వెంకట్‌ మంత్రి, ఫాలాక్ష్‌ అవస్థి వివిధ బాధ్యతలు చేపట్టనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events