Namaste NRI

మాధవ్ సినిమా టైటిల్ మారెమ్మ- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రవితేజ సోదరుని కుమారుడు మాధవ్‌ మారెమ్మ అనే సినిమాతో కథానాయకునిగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్‌ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్‌ బేనర్‌పై మయూర్‌ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్‌  అద్భుతమైన ఫస్ట్ లుక్   పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌లో మాధవ్‌ గళ్ల చొక్కా, లుంగీ ధరించి, మెడలో టవల్‌తో ఓ పల్లెటూరి హీరోగా కనిపిస్తున్నారు. పోస్టర్‌ బ్యాక్‌డ్రా్‌పలో ఉన్న గేదె అతని బలం, ఆధిపత్యాన్ని సూచిస్తోంది. మాధవ్‌ పొడవాటి కర్రను పట్టుకొని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. కాగా, సినిమాను గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News