Namaste NRI

అమ్మ నాన్న మధ్యలో మధురవాణి మూవీ లాంచ్

గౌతమ్‌ రాజ్‌, సాయి విక్రాంత్‌  హీరోలుగా మధుప్రియ, లావణ్య శర్మ, సిరి, అంబిక హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అమ్మ నాన్న మధ్యలో మధురవాణి. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ క్లాప్‌ ఇవ్వగా, ఫణి కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా టీడీ ప్రసాద్‌ వర్మ మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది అన్నారు. రెండు తరాలకు చేరువయ్యేలా ఉంటుంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం.  రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం అన్నారు. ఈ సినిమాతో మా అబ్బాయి గౌతమ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం అన్నారు బృందాకర్‌ గౌడ్‌. టి.డి. ప్రసాద్‌ వర్మ దర్శకుడు. పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్‌ సమ్పరణలో బృందాకర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. నరేష్‌ వీకే, పవిత్రా లోకేష్‌, నందమూరి తారకరత్న తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాసు, ఎడిటింగ్‌: శివ శర్వాణి, సాహిత్యం : మిట్టపల్లి సురేందర్‌, సంగీతం: కార్తీక్‌ బి కడకండ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events