Namaste NRI

మహేశ్‌-రాజమౌళి చిత్రం ప్రారంభం

మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో మహేష్‌బాబు కూడా పాల్గొన్నారని తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వేసవిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని సమాచారం. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

ఇందులో పలువురు హాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారు. అత్యున్నత సాంకేతిక హంగులు, వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో తనదైన శైలి ఇంటెన్స్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబో తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress