మహేశ్‌బాబు హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్దే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. నెక్ట్స్ షెడ్యూల్లో పూజా హెగ్దే జాయిన్ అవుతారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)