భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మేకిన్ ఇండియా విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌లో ఈ ఇనిషియేటివ్ సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. భారత్‌లోని మన స్నేహితులు, రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోదీ కొన్ని సంవత్సరాల క్రితం మేకిన్ ఇండియా తీసుకువచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిందైన సత్ఫలితాలిస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదు అని ప్రశంసించారు.