అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించిన 72 ఏళ్ల వ్యక్తిని న్యూయార్క్ లో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అరెస్టు చేశారు. నిందితుడిపై నేర అభియోగపత్రాన్ని సమర్పించారు. బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో థామస్ వెల్నిక్ కేసులో వాదనలు జరిగాయి. కావాలనే అతను మాజీ అధ్యక్షుడిని బెదిరించినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టు తెలిపారు. గత ఏడాది జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో కేసులో థామస్ వెల్నిక్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో అతను ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తే అతన్ని చంపేస్తానని 2020 జులై నెలలో థామస్ వెల్నికీ తెలిపారు. ఒక వేళ ట్రంప్ ఓడినా ఆఫీసు నుంచి వెళ్లకుంటే అప్పుడు ఆయుధాలు ఖరీదు చేసి అతన్ని చంపేస్తానంటూ క్యాపిటల్ హిల్ పోలీసులకు థామస్ తెలిపారు. ఇదే అంశంపై పలుమార్లు పోలీసులకు అతను మెసేజ్ కూడా చేశారు. దీనిపై బ్రూక్లిన్ కోర్టులో విచారణ జరిగింది. ఇందులో ట్రంప్‌తో పాటు 12 మంది కాంగ్రెస్ సభ్యులను చంపుతానని వెల్నీకీ బెదిరించాడు.
