అమెరికాలోని ఓ సిటీ మేయర్‌గా భారత సంతతి చెందిన వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగర మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగిన భారత సంతతికి చెందిన అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన సిన్సినాటి నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్ అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్ గుర్తింపు పొందారు. అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్ తండ్రి ఇండియన్ కాగా, ఆయన తల్లి టిబెటియన్. ఈయన ఓహియోలో జన్మించి అక్కడే పెరిగారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న ఇండియన్ అమెరికన్లతో పాటు టిబెటియన్ దేశస్తులు కూడా హాజరయ్యారు.














