Namaste NRI

ఓ చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

నాగప్రణవ్‌, కావేరి కర్ణిక, ఆద్యరెడ్డి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ప్రేమకథాచిత్రం ఓ చెలియా . ఎం.నాగ రాజశేఖరరెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. హీరో మంచు మనోజ్‌ ఈ పాటను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నువ్వే చెప్పు చిరుగాలి  అంటూ సాగే ఈ పాటను సుధీర్‌ బగడి రాయగా, ఎం.ఎం.కుమార్‌ స్వరపరిచారు. సాయిచరణ్‌ ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమబంధాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ బాలా.

Social Share Spread Message

Latest News