శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించిన చిత్రం మను చరిత్ర. భరత్ పెదగాని దర్శకత్వంలో నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. భరత్ పెదగాని మాట్లాడుతూ సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. లవ్ అండ్ వార్ కన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రబోస్‌గారు ఈ సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు అన్నారు. మంచి కథతో తీసిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమా తీస్తాం అన్నారు. నార్ల శ్రీనివాస్ రెడ్డి. శివ కందుకూరి మాట్లాడుతూ ప్రతి నటుడు తన కెరీర్లో ఓ మంచి సినిమా చేయాలనుకుంటాడు. ఆ కోరిక నాకీ చిత్రంలోనే నెరవేరింది అన్నారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాట్లాడారు














