Namaste NRI

మస్క్‌ పేరుతో మస్కా..మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా

డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్ట నిలువునా మునిగింది. మస్క్ నంటూ నమ్మబలికిన కేటుగాడి మాయలో పడి రూ. లక్షల్లో నష్టపోయింది. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్‌జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. అందుకు డీప్‌ఫేక్ వీడియో కారణ మైంది. ఎలాన్‌మస్క్ జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. అలాంటి నాకు గత ఏడాది ఒక కలలాంటి అనుభవం ఎదురైంది. జులై 17న ఇన్‌స్టాగ్రాంలో మస్క్ పేరుతో ఉన్న ఖాతాకు ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేశాడు. అది చూసి , మొదట నాకు అనుమానం వచ్చింది. అయితే తన పని ప్రదేశంలోని చిత్రా లు షేర్ చేయడం, తన పిల్లల గురించి మాట్లాడటం చూసి ఆ సందేహాలు ఎగిరిపోయాయి. అలాగేతన అభిమానులను కాంటాక్ట్ అయ్యే తీరును ఆయన వెల్లడించాడు.

దక్షిణ కొరియా అధ్యక్షుడితో తన మీటింగ్ గురించి చెప్పాడు. ఒకసారి వీడియో కాల్‌లో మాట్లాడుతూ నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడు  అంటూ ఆమె వెల్లడించారు. ఆ సైబర్‌నేరగాడు ఆ కాల్‌ను ఏఐ డీప్‌కేక్ సాంకేతికతను ఉపయోగించి మాట్లాడినట్టు ఆమె పేర్కొన్నారు.  తర్వాత తన కొరియన్ ఉద్యోగుల కోసం డబ్బు పంపేలా అతడు నన్ను ఒప్పించాడు. నా డబ్బును పెట్టుబడిగా పెట్టి, ధనవంతురాలిని చేస్తానని నమ్మ బలికాడు. తన అభిమానులు ధనవంతులుగా మారితే తనకు సంతోషమన్నాడు అని ఆమె తెలిపారు. ఆ మాయమాటలు నమ్మిన ఆమె డబ్బు పంపారు. చివరకు రూ. 41 లక్షలు పోగొట్టుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress