Namaste NRI

యువ దర్శకులను  ఆకట్టుకున్న మసూద

సంగీత, తిరువీర్‌, కావ్య కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మసూద. ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. హారర్‌ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్‌ రూపొందించారు. ఈ సినిమా నేడు రిలీజ్‌ అవుతున్నది. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి వెంకటేశ్‌ మహా, వివేక్‌ ఆత్రేయ,  ఆర్‌.ఎస్‌.జె. స్వరూప్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మహా మాట్లాడుతూ  హారర్‌ జానర్‌ తీయాలన్న ఆసక్తి లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా ఆ మాట అన్నా. కానీ, నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశా. చాలా భయపడ్డాను. సాయి అంత అద్భుతంగా సినిమా తెరకెక్కించారు అన్నారు. అనంతరం  నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా మాట్లాడుతూ మా సంస్థ నుంచి మరో మంచి చిత్రాన్ని నిర్మించాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. హారర్‌ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ప్రీమియర్‌ చూసిన యువ దర్శకులంతా సినిమా తమను ఆకట్టుకుందని చెప్పడం సంతోషంగా ఉంది అన్నారు. హారర్‌ చిత్రాలను తీయాలంటే సాంకేతిక పరిజ్జానం ఉండాలి. తొలి చిత్రంలోనే ఆ పరిజ్ఞానాన్ని దర్శకుడు సాయి చూపించారు దర్శకుడు వివేక్‌ తేయ అన్నారు.  ఈ కార్యక్రమంలో స్వరూప్‌ ఆర్జే, వివేక్‌ ఆత్రేయ,  వెంకటేష్‌ మహా, సందీప్‌ రాజ్‌, వినోద్‌ అనంతరోజు ఆర్‌.విహారి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బానెల్‌, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events