మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.నిర్మాత మాట్లాడుతూ న్యాయవాదిగా రవితేజ పాత్రచిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. ప్రజలకు న్యాయం చేసేందుకు అభినవ రావణాసురుడు ఎంచుకున్న మార్గమేమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది. రామ్‌గా సుశాంత్ పాత్ర కథలో కీలకంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. సెప్టెంబర్ 30న సినిమా విడుదల చేస్తాం. యూక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది అని తెలిపారు. ప్రధాన తారాగణంపై నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, హర్షవర్ధన్ రామేశ్వర్. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.