Namaste NRI

విక్రాంత్‌ రోణ లో మాస్‌ సాంగ్‌

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా విక్రాంత్‌ రోణ. జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రా రా రాక్కమా అనే లిరికల్‌ పాటను విడుదల చేశారు. బి.అజనీష్‌ లోకనాథ్‌ స్వరపర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, మంగ్లీ, నకాష్‌ అజీబ్‌ ఆలపించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మాస్‌ బీట్‌తో సాగే ఈ పాట ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణలో శాలిని ఆర్ట్స్‌ బ్యానర్‌పై శాలిని మంజునాథ్‌, జాక్‌ మంజునాథ్‌ నిర్మించారు. త్రీడీ ఫార్మేట్‌లో దర్శకుడు అనూప్‌ భండారి రూపొందిస్తున్నారు. జులై 28న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌, లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: విలియమ్‌ డేవిడ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events