Namaste NRI

నాని ఆవిష్కరించిన మసూద టీజర్‌

తిరువీర్‌, కావ్య జంటగా నటిస్తున్న సినిమా మసూద. ఈ చిత్రాన్ని స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. హారర్‌ డ్రామా కథతో నూతన దర్శకుడు సాయికిరణ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. పోస్ట్‌ ప్రోడక్షన్‌ తుది దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ టీజర్‌ బాగుంది. సినిమా టీమ్‌ ఇష్టంగా పనిచేసినట్లు కనిపిస్తున్నది. సినిమా త్వరగా చూడాలన్న ఆసక్తిని టీజర్‌ కలిగిస్తున్నది అన్నారు. నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా మాట్లాడుతూ మా సంస్థలో వస్తున్న మూడవ చిత్రమిది. దర్శకుడు సాయి కిరణ్‌ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ ధన్యవాదాలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం నగేశ్‌ బనెల్‌, సంగీతం ప్రశాంత్‌ ఆర్‌ విహారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events