మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) తొలి కన్వెన్షన్‌ను ఘనంగా నిర్వహించుకునేందుకు కిక్`ఆఫ్, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. న్యూజెర్సీలోని అల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమం లో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. తొలి కన్వెన్షన్ నిర్వహణకు 5 లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందించిన వారికి మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లోనూ కిక్ ఆఫ్ ఈమెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో గాయకులు సమీరా భరద్వాజ్, వేణు శ్రీరంగం పాటలతో సభికులను అలరించారు. దీప్తి నాగ్ యాంకరింగ్‌తో పాటు పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యుడు ప్రదీప్ సామల, ఈసీ మెంబర్ స్వాతి అట్లూరి, కార్యదర్శి ప్రవీణ్ గూడూరు, కో `ఆర్డినేటర్లు కిరణ్ దుద్దగి, వెంకట్ సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.