Namaste NRI

దీపావళి కానుకగా మెకానిక్‌ రాకీ

విశ్వక్‌సేన్‌  హీరోగా రూపొందుతోన్న చిత్రం మెకానిక్‌ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్‌సేన్‌ మాట్లాడారు. ఇది బ్యూటిఫుల్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ. అలాగే రొమాంటిక్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ కూడా. శ్రద్ధా శ్రీనాథ్‌, మీనాక్షి చౌదరి ఇద్దరూ వండర్‌ఫుల్‌ కో స్టార్స్‌. పనిచేసిన అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. సంగీతం, కెమెరా, ఆర్ట్‌, స్క్రిప్ట్‌ ఇలా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది. మలక్‌పేట్‌ నేపథ్యంతో కూడిన ఈ కథలో నా పాత్ర మాస్‌ మెచ్చేలా ఉంటుంది. సినిమా చూసిన అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు అని అన్నారు.

దర్శకుడు రవితేజ చాలా ట్యాలెంటెడ్‌. సినిమాను ప్రేమిస్తాడు. ఆ ప్రేమంతా తన టేకింగ్‌లో కనిపించింది. అద్భుతంగా తీశాడు. జేక్స్‌ బిజోయ్‌ న్యూ ఏజ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటలన్నీ బావున్నాయి. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా దీవాలీ క్రాకర్‌ అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేశారు విశ్వక్‌సేన్‌. మెకానిక్‌ రాకీ మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, అందరికీ నచ్చుతుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ఇందులో తన పాత్ర రిలేటబుల్‌గా ఉంటుందని మీనాక్షి చౌదరి చెప్పింది. ఇంకా దర్శకుడుతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా మాట్లాడారు. అక్టోబర్‌ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events