అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల మీట్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించి పోయిందని అన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన కొనియాడారు. రైతు పండిరచిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులు ఎత్తేస్తే సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి కొనుగోలు చేశారు. మిషన్ భగీరథతో ప్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతుందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణా రికార్డులకెక్కిందన్నారు. అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డితో పాటు ఎన్‌ఆర్‌ఐలు శ్రీనివాస రెడ్డి, మనోహన్, కాల్వల విషు, పాదురు శ్రవణ్, అమరేందర్ బొజ్జ, సుధా కొండరాపు, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.














