Namaste NRI

ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో .. న్యూజెర్సీలో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన నేపథ్యం లో ఆగష్టు 4న ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోగల రాయల్ అల్బెర్ట్స్ పాలస్‌లో భారీ ఎత్తున సమావేశం జరగనుంది. ఈ సమావేశ సన్నాహా ల్లో భాగంగా నిర్వాహక బృందం జూలై 28 రాయల్ అల్బెర్ట్స్ పాలస్ సందర్శించారు. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్న ఈ సమావేశానికి చెయ్యాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించే నిమిత్తం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట రానున్నారు.

Social Share Spread Message

Latest News