Namaste NRI

మెగా-విక్టరీ హంగామా.. మన శంకరవరప్రసాద్ గారు నుంచి మాస్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. తాజాగా విడుదల చేసిన ఈ పాటలో చిరు-వెంకీ కాంబో తమదైన స్టెల్‌, గ్రేస్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు.

ఈ సూపర్‌స్టార్స్‌ ఇద్దరూ సిగ్నేచర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్‌ రచించారు. ఏంటి బాసూ సంగతీ..అదిరిపోద్దీ సంక్రాంతీ, ఏంటి వెంకీ సంగతీ..ఇరగతీద్దాం సంక్రాంతి వంటి హుషారైన చరణాలతో ఈ పాట ఆద్యంతం జోష్‌ నింపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events