పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసిన చిరంజీవి చిత్రం అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉందని కొనియాడారు. మా కుటుంబంతో కలిసి ఓజీ సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రతి బిట్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. సరైన భావోద్వేగాలను నిలుపుకుంటూనే హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది. ఈ సినిమా దర్శకుడు సుజిత్ పనితీరు అద్భుతం మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు సినిమాను అసాధారణ రీతిలో ఊహించారు. తెరపై కల్యాణ్ బాబును చూసి చాలా గర్వంగా అనిపించింది. తన స్వాగ్తో సినిమాను నిలబెట్టి, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగను అందించారన్నారు.

మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులను కూడా చిరంజీవి అభినందించారు. తమన్ సంగీతం కోసం తన హృదయాన్ని, ఆత్మను పారబోశారు, రవి కె. చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు ఎడిటింగ్ మరియు ఆర్ట్‌వర్క్ సూపర్. ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి అత్యుత్తమమైన అవుట్‌పుట్‌ను అందించారు. నిర్మాత దానయ్యకు మరియు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని తెలిపారు.















