భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నా డు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపసాన ఉన్నారు.
2024 సంవత్సరానికి 132 మందికి పద్మ అవార్డులను అందచేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ , 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డుకు ఎంపికైన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐ విభాగంలో 8 మంది జాబితాలో ఉన్నారు. 9 మంది మరణానంతరం అవారుకు ఎంపికయ్యారు.