Namaste NRI

మెయ్యళగన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

కార్తీ  హీరోగా నటిస్తున్న చిత్రం మెయ్యళగన్‌.  సూర్య, జ్యోతిక ఈ సినిమాకు నిర్మాతలు. సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా మెయ్యళగన్‌  అనే ఈ సినిమా పేరును, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో అరవింద్‌స్వామి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.  కార్తీ, అరవింద్‌స్వామి మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరించింది. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాష చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. రాజ్‌కిరణ్‌, శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాశ్‌, శ్రీరంజని, ఇళవరసు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్‌ వసంత, కెమెరా: మహేంద్రన్‌ జయరాజు, సహనిర్మాత: రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events