
గత 23 ఏండ్లుగా సేవలందిస్తూ వస్తున్న మైక్రోసాప్ట్‌కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ మే 5 నుంచి తన సేవలకు స్వస్తి పలకనుంది. ఈ ఏడాది మే 5 నుంచి స్కైప్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. అయితే మరింతగా ఈ తరహా సేవలు పొందేందుకు వినియోగదారులు మైక్రోసాఫ్ట్ టీమ్స్ (ఉచితం)లోకి మారవచ్చు అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుత స్కైప్ వినియోగదారులు టీమ్స్ వేదికలోకి మారి తమ డాటాను అందులోకి బదిలీ చేసుకోవచ్చునని తెలిపింది.

రానున్న మూడు నెలల కాలంలో స్కైప్ నుంచి టీమ్స్‌లోకి తమ వినియోగదారులను మెల్లిగా బదిలీ చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది.అప్పట్లోనే స్కైప్ మనుగడను పలువురు అనుమానించారు. ప్రస్తుతం స్కైప్ ద్వారా ఒకరికి ఒకరు లేదా గ్రూప్‌లకు కాల్స్, మెసేజ్‌లు పంపడంతో పాటు ఫైళ్ల షేరింగ్ చేసుకోవచ్చు.
