ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు చలించిపోతున్నారు. రాష్ట్రంలోని కడప జిల్లా రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మందికి వచ్చిన పాద గురించి తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రవాసీయులు రాజంపేట వాసులకు తమకు వీలయిన విధంగా చేయూత అందించడానికి ముందుకు వస్తున్నారు. కువైత్‌లోని ప్రవాసీయులు బాధిత కుటుంబాలకు సహాయమందిస్తున్నారు. దుబాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. దుబాయ్‌లో కోస్టా ట్రావెల్స్ నిర్వహిస్తున్న కడప జిల్లా పులపూత్తూరు గ్రామానికి చెందిన రెడ్డయ్య, మరికొందరి సహకారంతో బాధితులకు అవసరమైన అత్యవసర గృహోపయోగ పరికరాలు అందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)