వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్ ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింమ్స్ అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్దుముద్ధ, అల్లు బాజీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గని ఫస్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను యూనిట్ విడుదల చేసింది. వరుణ్‌తేజ్ ఫేస్‌ను రిలీవ్ చేయగానే అతను పంచ్ విసురుతాడు. గని కనివిని ఎరుగని అనే లైన్ బ్యాక్ గ్రౌండ్ లో విన్పిస్తుంది. ఇది వరకు చిత్రాలకు భిన్నంగా వరుణ్‌తేజ్ ఈ మూవీలో సరికొత్త లుక్‌లో కన్పిస్తున్నారు.
డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. నిర్మాత మాట్లాడుతూ తేజ్‌గారు బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమా కావటం, మా డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి కథ నచ్చటంతో వెంటనే ఒకే చెప్పేశారని అన్నారు. ఆయన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. డిసెంబర్ 3న విడుదల చేస్తున్నామని తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోందని అన్నారు.