Namaste NRI

లండన్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

మహానాడుకు సన్నద్ధంగా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్‌లో మినీ మహానాడు ను టీడీపీ ఎన్నారై విభాగం (యూకే) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్‌ కార్యకర్తల్ని సన్మానించారు.  పహల్గాం ఉగ్రదాడి లో మరణించిన వారికి టీడీపీ ఎన్నారై విభాగం నాయకులు  సంతాపం తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌  తో పాకిస్థాన్‌కు గట్టి బుద్ది చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వానికి, భారత సైనికుల ధైర్య సాహసాలకు అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఎన్టీఆర్‌ చెప్పిన ఆత్మగౌరవం, చంద్రబాబు నింపిన ఆత్మ  విశ్వాసంతో తెలుగుజాతి అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని టీడీపీ ఎన్నారై విభాగం నాయకులు కొనియాడారు.

నటుడు నందూమరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ పురసారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు పెట్టుబడుల ఆకర్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు  కృతజ్ఞతతు తెలిపారు. అమరావతి రైతుల ర్యసాహసాల్ని  మెచ్చుకుంటూ తీర్మానం చేసి ఆమోదించారు. కార్యక్రమానికి యూకేలోని టీడీపీ ఎన్నారై నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం తెలుగు వంటకాలతో విందు ఏర్పాటుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events