శుభాంగి తంబాలే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఫీమేల్. బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీపీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా ఈ సినిమా ఉపయోగపడాలని కోరుకుంటున్నా అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు నాని తిక్కిశెట్టి. సంగీతం: వంశీకాంత్ రేఖన, కూర్పు: క్రాంతి, ఛాయాగ్రహణం: జగదీష్ కొమరి.














