టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. 49 కిలోల విభాగం స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోల బరువు ( మొత్తం 202 కిలోలు)ను ఎత్తి రజిత పతకాన్ని సాధించింది. దీంతో 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రజిత పతకాన్ని అందించిన తొలి మహిళా లిప్టర్‌గా చాను రికార్డు నెలకొల్పింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి భారత్‌కు తొలిసారి కాంస్య పతకాన్ని అందించగా. ఇప్పుడు ఆ రికార్డును చాను బ్రద్దలు కొట్టింది. మరోవైపు టోక్యోలో తొలి స్వర్ణ పతకాన్ని చైనాకు చెందిన యాంగ్ కి యాన్ 10మీ. ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో సాధించింది.