స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన రొమ్-కామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి. దర్శకత్వం వహించగా.. UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎనౌన్స్ చేసినప్పటినుండే అందరి ఆసక్తిని ఆకర్షించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా, ఇవ్వాల ఈ సినిమా ట్రైలర్‌ను అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 21న మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఇక ఈ మూవీని జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్, పాటలతో తెలిసిపోతుంది. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
